హైదరాబాద్లోని బాలాపూర్ గణేశుడి లడ్డూ రికార్డు ధర పలికింది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న వేలం పాటకు వేలమంది భక్తులు తరలివచ్చారు. బాలాపూర్ గణేశ్ మండపం నుంచి భక్తుల నృత్యాలు, కోలాహలం మధ్య ప్రారంభమైన శోభాయాత్ర బాలాపూర్ ముఖ్యకూడలి బొడ్రాయి వద్దకు చేరుకుంది. ఈ జంక్షన్ వద్ద రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి వచ్చారు. బాలాపూర్ గణపయ్యకు మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లడ్డూ వేలం పాట ప్రారంభించారు.
balapur laddu auction 2022 : బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర.. దక్కించుకున్న స్థానికుడు - balapur laddu bidding 2022
balapur laddu auction 2022 : హైదరాబాద్లో బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది రికార్డు ధర పలికింది. గతేడాది 18లక్షల 90వేలు పలికిన లడ్డూ వేలం... ఈసారి అంతకుమించి... 24 లక్షల 60వేల ధర పలికింది. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుడు... వంగేటి లక్ష్మారెడ్డి24 లక్షల 60వేలకు లడ్డూ దక్కించుకున్నాడు
బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర
బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది రికార్డు ధర పలికింది. గతేడాది 18లక్షల 90వేలు పలికిన లడ్డూ వేలం... ఈసారి అంతకుమించి... 24 లక్షల 60వేలు పలికింది. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుడు... వంగేటి లక్ష్మారెడ్డి 24 లక్షల 60వేలకు లడ్డూ దక్కించుకున్నాడు. బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటలో 9 మంది పోటీపడ్డారు. లడ్డూ కోసం ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరుల పోటీ పడ్డారు. గతేడాది కంటే రూ.5.70 లక్షలు ఎక్కువ పలికింది.
ఇవీ చదవండి :