సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బంజారాహిల్స్ శాఖ రిలేషన్‌షిప్ మేనేజర్లు శ్రీనివాస్, ఫణీంద్ర ఈ నెల 13న బాలకృష్ణ అకౌంటెంట్ వెలిగల సుబ్బారావుకు ఫోన్ చేసి వసుంధర ఖాతాకు సంబంధించి మొబైల్ బ్యాంకింగ్ దరఖాస్తును యాక్టివేట్ చేయాలా అని అడిగినట్లు పోలీసులు తెలిపారు.
తాము ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని వసుంధర, అకౌంటెంట్ స్పష్టం చేశారు. బ్యాంకు అధికారులు విచారణ చేపట్టగా బాలకృష్ణ వద్ద కొత్తగా చేరిన జూనియర్ అకౌంటెంట్ కొర్రి శివ.. వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసి మొబైల్ బ్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసినట్లు తేలింది. సుబ్బారావు ఫిర్యాదు మేరకు శివపై జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు.