ఎన్టీఆర్ 25వ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్‌ను పూలతో అలంకరించారు. ఘాట్‌ను సందర్శించిన బాలకృష్ణ... తారక రాముడికి నివాళి అర్పించారు. దివంగత నేత సేవలను బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూల చాటిన తెలుగు వెలుగు నందమూరి తారక రామరావు అని అన్నారు. ఆయన జీవితం పెద్ద పాఠ్యాంశమని పేర్కొన్నారు. తనకు నిరుత్సాహం, నిర్లిప్తత ఉన్నప్పుడు ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తలుచుకుంటానని చెప్పారు.
ఎన్టీఆర్ ఘాట్‌కు నందమూరి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ అమర్ రహై అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి అంజలి ఘటించారు.