ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు - jai balayya news

Balakrishna Birthday: నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను తెలుగురాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. హైదరాబాద్ బసవతారకం ఆస్పత్రిలో నిర్వహించిన పుట్టినరోజు సంబరాల్లో పాల్గొన్న బాలకృష్ణ క్యాన్సర్ బాధిత చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

balakrishna
balakrishna

By

Published : Jun 10, 2022, 10:28 PM IST

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 63వ పుట్టినరోజు వేడుకల్ని తెలుగురాష్ట్రాల అభిమానులు పండగలా జరుపుకున్నారు. హైదరాబాద్ బసవతారకం ఆస్పత్రిలో నందమూరి బాలకృష్ణ తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆ తరువాత బాలయ్య ఆరోగ్యశ్రీ ఓపీడీ బ్లాక్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలతోపాటు బాలకృష్ణ కుటుంబ సభ్యులు బ్రాహ్మాణి, భరత్, దేవాంశ్ పాల్గొన్నారు.

విశాఖ డాబా గార్డెన్స్ సరస్వతి పార్కు కూడలి వద్ద బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. కృష్ణాజిల్లా కర్లపూడి తెదేపా కార్యాలయం వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమా కేక్ కట్ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బాలయ్య జన్మదిన వేడుకల్లో భాగంగా కోడెల శివరాం అన్నదానం నిర్వహించారు.

కర్నూలులో బాలయ్య అభిమానులు రక్త దానం చేశారు. కర్నూలు జిల్లా కల్లూరులో బీరప్ప స్వామి దేవాలయంలో తెదేపా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మిగనూరులో తెదేపా నేతలు, అభిమానులు కేట్ కట్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు నిర్వహించారు.శ్రీ సత్యసాయి జిల్లా సుగురు ఆంజనేయ స్వామి ఆలయంలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప జిల్లాలో పేదలకు ఉచితంగా చీరల పంపిణీ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరు జిల్లాలో పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. బాలకృష్ణ నిండు నూరేళ్లు జీవించాలని తిరుమలలో కొబ్బరికాయలు కొట్టారు.

U.Kలో ఉండే తెలుగు చిన్నారి లాస్య బాలకృష్ణపై తన అభిమానాన్ని చాటుకుంది. అఖండ సినిమాలోని జైబాలయ్య పాటకు పియానో ట్యూన్ ప్లే చేసి అందరినీ ఆకట్టుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details