YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు.. ముగ్గురి బెయిల్ పిటిషన్లు కొట్టివేత - వైఎస్ వివేకా హత్య కేసుపై హైకోర్టులో విచారణ
12:03 August 01
ఏ2 సునీల్, ఏ3 ఉమాశంకర్, ఏ5 శివశంకర్ బెయిల్ పిటిషన్లు కొట్టివేత
YS Vivekananda murder case: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు దాఖాలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. హత్య కేసులో నిందితులైన A2 సునీల్ యాదవ్, A3 గజ్జల ఉమాశంకర్ రెడ్డి, A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు బెయిల్ మంజూరు చేయలంటూ పిటిషన్ దాఖాలు చేశారు. పిటిషనర్లను నుంచి ఇప్పటికే సీబీఐ అధికారులు స్టేట్ మెంట్ నమోదు చేశారని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినింపించారు. సీబీఐ చెబుతున్నట్లు సాక్షులను ప్రభావితం చేస్తారనే ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. హత్య కేసులో నిందితులు పాల్గొన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. ఎటువంటి షరతులు విధించి అయినా నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. నిందితులు జైళ్లో ఉంటునే సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Court dismissed Bail petition: కేసులో అప్రూవర్‌గా మారిన వారిని చంపేస్తామని బెదిరించిన్నట్లు పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని న్యాయమూర్తికి తెలిపారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని ఈ సమయంలో బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని సీబీఐ న్యాయవాది తెలిపారు. ఇదే కేసులో వైఎస్ వివేకా కుమార్తె సునీత తరపు వాదనలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని సునీత తరపు న్యాయవాది కోరారు. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ తీర్పును ఇచ్చింది.
ఇవీ చదవండి: