ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Pub Case: 'పబ్​లో దొరికిన డ్రగ్స్​కు వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు..' - పబ్​లో దొరికిన డ్రగ్స్​కు వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు.

Hyderabad Pub Case: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పుడింగ్ పబ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నిందితులుగా ఉన్న అభిషేక్​, అనిల్​ బెయిల్​ పిటిషన్​పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. పబ్​లో దొరికిన డ్రగ్స్​కు.. అభిషేక్, అనిల్​కు ఎలాంటి సంబంధం లేదని వాళ్ల తరఫు న్యాయవాది వాదించారు. ఇద్దరికీ బెయిల్​ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

పుడింగ్ పబ్ కేసు
పుడింగ్ పబ్ కేసు

By

Published : Apr 19, 2022, 10:07 PM IST

Hyderabad Pub Case: హైదరాబాద్​లోని పుడింగ్ పబ్ కేసులో నిందితుల బెయిల్​ పిటిషన్​పై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతోంది. నిందితులిద్దరికీ బెయిల్ ఇవ్వాలని అభిషేక్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. పబ్​లో దొరికిన మాదకద్రవ్యాలకు... అభిషేక్, అనిల్​కు ఎలాంటి సంబంధం లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటికే పోలీసులు ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారని.. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని కోర్టుకు తెలిపారు. రేపు పోలీసుల తరఫు న్యాయవాది వాదించనున్నారు.

ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పంజాగుట్ట మాదకద్రవ్యాల కేసులో నిందితులుగా ఉన్నవాళ్లకు, పుడింగ్ పబ్ నిర్వాహకులకు పరిచయాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కొన్ని ఆధారాలను సైతం పోలీసులు సేకరించారు. పంజాగుట్ట కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టోనీ.. ఏజెంట్ల సాయంతో హైదరాబాద్, బెంగళూరు, గోవా, ముంబయిలో మాదకద్రవ్యాలు సరఫరా చేశాడు. బాబూషేక్, నూర్​మహమ్మద్ అనే ఏజెంట్లు హైదరాబాద్​లో 12 మంది వ్యాపారులకు డ్రగ్స్​ సరఫరా చేయడానికి వచ్చి టాస్క్​ఫోర్స్ పోలీసులకు దొరికిపోయారు.

పలు పబ్​లకు కూడా బాబూషేక్, నూర్​మహమ్మద్ మాదకద్రవ్యాలు సరఫరా చేసనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాబూషేక్ వద్ద డ్రగ్స్​ తీసుకున్న కొందరు వ్యాపారులకు... పుడింగ్ పబ్ నిర్వాహకులకు పరిచయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం పరిచయం వరకు ఆగిపోయిందా..? లేక ఏమైనా లావాదావేలు నిర్వహించారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...

ABOUT THE AUTHOR

...view details