జేసీ ప్రభాకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు - జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్
16:52 August 19
జేసీ ప్రభాకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ కేసులో జైల్లో ఉన్న ఆయనకు అనంతపురం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో గుండె శస్త్ర చికిత్స జరిగిందని...తాజాగా కరోనా సోకిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అత్యవసర పరిస్థితిని గుర్తించిన కోర్టు... బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చదవండి
బెయిల్‌పై వచ్చిన 24 గంటల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు.. 21 వరకూ రిమాండ్