ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని రైతుల బెయిల్ పిటిషన్ కొట్టివేత - అమరావతి రైతుల ఆందోళన వార్తలు

ఇటీవల అరెస్టయిన రాజధాని రైతులకు నిరాశ ఎదురైంది. వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్​ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టి వేసింది.

bail
bail

By

Published : Nov 5, 2020, 4:03 PM IST

Updated : Nov 5, 2020, 5:37 PM IST

మూడు రాజధానులకు మద్దతుగా దీక్షలకు వెళ్తున్న వారిని అడ్డుకున్న కేసులో అరెస్టయిన అమరావతి రైతులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్​ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టి వేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంకు చెందిన రైతులు ఈ కేసులో అరెస్టయి ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్​పై గుంటూరు జిల్లా కోర్టు గురువారం విచారించింది. బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారుడి వాంగ్మూలం మంగళగిరి కోర్టులో నమోదు చేయాల్సి ఉందన్నారు. దీనివల్ల బెయిల్ పిటిషన్​ను కోర్టు కొట్టేసింది.

ఫిర్యాదుదారుడు రవి రెండు రకాల ప్రకటనలు చేయటం వల్లే ఈ సమస్య వచ్చిందని కృష్ణాయపాలెం రైతులు చెబుతున్నారు. మంగళగిరి కోర్టులో ఫిర్యాదుదారుడు వాంగ్మూలం ఇచ్చాక... జిల్లా కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. అప్పుడు కూడా న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని రైతులు తెలిపారు.

Last Updated : Nov 5, 2020, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details