Bail: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ సికింద్రాబాద్ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. రైల్వే కోర్టు 16 మందికి బెయిల్ మంజూరు చేసింది. నిందితులుగా ఉన్న అభ్యర్థులకు పరీక్షలు ఉండటంతో బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. ఏ1 నుంచి ఏ10 వరకు ఉన్న నిందితులకు రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ కేసులో మొత్తం 63 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు బెయిల్‌ను రైల్వే కోర్టు గతంలో రిజెక్ట్ చేసింది. దీంతో ఆవుల సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం సుబ్బారావు బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో 16 మందికి బెయిల్ మంజూరు - సికింద్రాబాద్ అల్లర్ల నిందితులకు బెయిల్
Secunderabad riots: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. రైల్వే కోర్టు 16 మందికి బెయిల్ మంజూరు చేసింది. నిందితులుగా ఉన్న అభ్యర్థులకు పరీక్షలు ఉండటంతో బెయిల్ ఇచ్చినట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే..కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కనీవినీ ఎరగని రీతిలో విధ్వంసం చెలరేగింది. ఒక్కసారిగా దూసుకువచ్చిన వేలమంది ఆర్మీ ఆశావహులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. 8 రైళ్లకు చెందిన బోగీలను తగులబెట్టారు. షాపులను లూటీ చేశారు. ఆర్టీసీ బస్సులపైనా దాడిచేశారు. పక్కా పథకం ప్రకారం జరిగిన ఆ దమనకాండను ఆపేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. పలువురికి బుల్లెట్లు తాకి గాయాలయ్యాయి.
ఇవీ చదవండి: