తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని నాచారంలో శిశు విక్రయం సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శిశువును విక్రయించిన 5నెలల అనంతరం తన బిడ్డను తమకు ఇవ్వాలంటూ మీనా, వెంకటేశ్ దంపతులు పోలీసులని ఆశ్రయించారు. దంపతులకు బాబును అప్పగిస్తే మళ్లీ అమ్ముకునే అవకాశం ఉన్నందున.. బాబును సీడబ్ల్యూసీకి అప్పగించి శిశువిహార్‌లో ఉంచామని నాచారం సీఐ కిరణ్ కుమార్ తెలిపారు.
ఇదీ జరిగింది
మీనా, వెంకటేశ్ దంపతులకు మొదట ఒక అమ్మాయి పుట్టి పురిటిలోనే చనిపోయింది. మళ్లీ రెండోసారి అమ్మాయి పుటింది. మూడోసారి కూడా అమ్మాయి పుడుతుందని అపోహతో 5నెలల గర్భిణిగా ఉన్నప్పుడే బిడ్డను అమ్మడానికి జానకి అనే మహిళకు సమాచారం ఇచ్చారు. జానకి తను పనిచేసే దగ్గర రాజేష్, నగీన దంపతులకు పిల్లలు లేరని తెలుసుకుని బిడ్డను ఇప్పిస్తానని చెప్పింది. బిడ్డ కోసం లక్ష రూపాయలు ఇస్తామని కాప్రా జీహెచ్ఎంసీలో పనిచేసే రాజేష్‌తో మాట్లాడుకున్నారు.