ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: 5.5 కిలోల శిశువు జననం... తల్లీబిడ్డ సురక్షితం - నిర్మల్ జిల్లా వార్తలు

తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌ జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బాల భీముడు జన్మించాడు. మంగళవారం ఓ మహిళ 5.5 కిలోల బరువు కలిగిన మగశిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.

baby-boy-with-birth-weight-of-5-point-5-kg-born-point-at-nirmal-district
5.5 కిలోల శిశువు జననం... తల్లీబిడ్డ సురక్షితం

By

Published : Jun 24, 2020, 5:13 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్​ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం ఓ మహిళ 5.5 కిలోల బరువు కలిగిన మగశిశువుకు జన్మనిచ్చింది. సోన్‌ మండలం లెఫ్ట్‌ పోచంపాడ్‌ గ్రామానికి చెందిన నేహా అనే మహిళ ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది.

సాధారణ కాన్పునకు వీలుకాని కారణంగా.. వైద్యులు రాజేందర్‌, సరోజ, మమత శస్త్రచికిత్స చేశారు. 5.5 కిలోల బరువుతో పండంటి మగబిడ్డ పుట్టాడు. పసికందు ఇంత బరువుతో జన్మించటం అరుదు అని.. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details