వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా మండలి గ్యాలరీలో కూర్చొని ప్రతిపక్ష నేత చంద్రబాబు సభా కార్యకలాపాలను వీక్షించారు. ఈ సందర్భంగా మార్షల్స్, చంద్రబాబు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్యాలరీలో నుంచి బయటికి వెళ్లాలని అసెంబ్లీ మార్షల్స్ చెప్పడంతో వారిపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. నన్ను వెళ్లమని ఆదేశించడానికి మీరెవరు అని ప్రశ్నించారు. వీఐపీ గ్యాలరీలోని ఎమ్మెల్యేలను బయటకు పంపమని అనడానికి స్పీకర్‌కు ఉన్న అధికారమేంటి అని అడిగారు. బయటికి వెళ్లమని మండలి ఛైర్మన్‌ను చెప్పమనండని అన్నారు. మండలి సిబ్బంది ఇక్కడికి రావాలి కానీ... మీరెందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నన్ను గ్యాలరీ నుంచి వెళ్లమనడానికి మీరెవరు?' - ఏపీకి మూడు రాజధానుల వార్తలు
మండలి గ్యాలరీ నుంచి బయటికి వెళ్లాలని అసెంబ్లీ మార్షల్స్ చెప్పడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి సిబ్బంది ఇక్కడికి రావాలి కానీ..మీరెందుకు వచ్చారని ప్రశ్నించారు.
babu fire on assembly marshals over discuss on decentralization bill