ప్రజారాజధాని కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆందోళన ఆగడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల పేరుతో మమ్మల్ని అణచివేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పటికి 11 మంది రైతులు గుండెపోటుతో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రచారం చేయడం కాదని... ధైర్యంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని స్పష్టం చేసే వారకు ఐకాస పని చేస్తుందని చెప్పారు.
అమరావతి కోసం పోరాటం ఆగదు: చంద్రబాబు - babu comments in JAC meeting news
ప్రజారాజధాని అమరావతి కోసం తమ పోరాటం ఆగదని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పే వరకు ఐకాస పని చేస్తుందని వెల్లడించారు.
babu comments in JAC meeting
Last Updated : Jan 9, 2020, 2:42 PM IST