కాసేపట్లో చైతన్యయాత్ర... పాల్గొననున్న చంద్రబాబు - .అమరావతిపై ఐకాస తలపెట్టిన చైతన్యయాత్ర
రాజధాని అమరావతి గురించి ఐకాస తలపెట్టిన చైతన్యయాత్రలో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. విజయవాడ బెంజ్‌సర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు ఈయాత్ర సాగనుంది. చైతన్యయాత్రలో పాల్గొనేందుకు తెదేపా శ్రేణులు, అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. మచిలీపట్నం చేరుకొని... అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాగా... పోలీసులు బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేసినా యాత్రను కొనసాగించాలని ఐకాసా నిర్ణయించింది. కాకినాడ, ఒంగోలు పట్టణాల్లోనూ చైతన్య సభలు నిర్వహించనున్నట్లు అమరావతి పరిరక్షణ కమిటీ తెలిపింది.
babu chaitanya yatra
.
Last Updated : Jan 9, 2020, 11:41 AM IST