ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దొంగ బాబా నిర్వాకం.. మంచి జరుగుతుందని యువతికి నిప్పంటించాడు..! - vikarabad district news

'మన వాళ్లకు లాజిక్​లకంటే మ్యాజిక్​లే కావాలి. అందుకే సర్​ మన దేశంలో సైంటిస్టుల కంటే బాబాలే ఫేమస్​'​... అని ఓ సినిమాలో హీరో చెప్పిన డైలాగును అక్షర సత్యం చేస్తూ.. నిరూపించిన ఘటనలు ఎన్నో! శాస్త్రవేత్తలకు, డాక్టర్లకు అందని లాజిక్​లు సైతం వీరి సొంతం. అందుకే బాబాల దగ్గర జనాల క్యూ మామూలుగా ఉండదు. రూ. వేలు, లక్షలు సైతం ధారపోసి.. తమ సమస్యలు తీర్చాలని వేడుకుంటారు. అలాగే ఓ యువతి సైతం ఓ బాబా దగ్గరికి వెళ్లింది. చివరికి ఆస్పత్రి పాలైంది. అసలేమైందంటే..?

Fake baba
దొంగ బాబా నిర్వాకం

By

Published : May 19, 2022, 11:54 AM IST

Fake baba in Parigi: తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్‌లో దొంగ బాబా నిర్వాకం వెలుగులోకి వచ్చింది. తాను చెప్పింది చేస్తే మంచి జరుగుతుందంటూ నమ్మించి.. తన దగ్గరకు వచ్చిన యువతి(18) కాళ్లు, చేతులను నిప్పులపై పెట్టించాడు ఓ బాబా. బాబా చెప్పినట్లుగా చేయడంతో సదరు యువతి రెండు కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో తల్లిదండ్రులు లబోదిబోమంటూ.. యువతిని వికారాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నకిలీ బాబా రఫీని బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇప్పటికే మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నట్లు నకిలీ బాబా రఫీపై పలు ఆరోపణలు ఉన్నాయి. జనాలను మోసం చేసి రూ.లక్షలు దండుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details