Tiranga Rally:ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా.. నెల్లూరులో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ నుంచి.. అయ్యప్ప గుడి సెంటర్ వరకు స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో భారీ ర్యాలీ తీశారు. ప్రజల్లో జాతీయ భావన ఉప్పొంగేలా నినాదాలు చేస్తూ.. ఉత్సాహంగా ర్యాలీ సాగింది. ఇందులో వివిధ పాఠశాలల విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కర్నూలులో మాంటిస్సోరీ విద్యాసంస్థల సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. బ్రిటీష్ వారిని తరిమికొట్టేందుకు క్విట్ ఇండియా ఉద్యమం ఎంతో కీలకపాత్ర పోషించిందన్నారు. ఈ ఉద్యమానికి 80 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టామని వివరించారు.