ఎస్ఈసీగా రమేశ్ కుమార్ తొలగింపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ విషయంలో కేంద్రం, ప్రధానితో మాట్లాడకుండా గవర్నర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్... న్యాయస్థానాల్లో నిలబడదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు కుదరవన్న ఆయన... రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ వ్యవహరించడం తగదని అన్నారు.
రమేశ్ కుమార్ తొలగింపు అప్రజాస్వామికం: అయ్యన్న - ayyannapathrudu reaction on SEC
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతల నుంచి రమేశ్ కుమార్ను తొలగించటం సరికాదని తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.
ayyannapathrudu reaction on ramesh kumar removed as SEC