ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సంతకం చేసే ముందు ఓసారి ఆలోచించండి'

ఎస్​ఈసీపై హైకోర్టు తీర్పుతోనైనా.. దస్త్రాలపై సంతకం చేసే ముందు పునఃపరిశీలించుకోవాలని గవర్నర్​ను కోరారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. హైకోర్టు సంచనల తీర్పు వైకాపా ప్రభుత్వానికి గుణపాఠం అవుతుందన్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

'సంతకం చేసే ముందు ఓసారి ఆలోచించండి'
'సంతకం చేసే ముందు ఓసారి ఆలోచించండి'

By

Published : May 30, 2020, 12:23 PM IST

Updated : May 30, 2020, 1:32 PM IST

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పుతోనైనా దస్త్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు గవర్నర్​ పునరాలోచించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు ఆర్డినెన్స్​పై గవర్నర్ సంతకం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

"న్యాయం, ధర్మాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. న్యాయస్థానం తీర్పు నియంత జగన్ చెంపచెల్లుమనిపించింది. రాష్ట్రాన్ని పాలించడమంటే జైలులో ఉన్నంత తేలిక కాదు. కక్ష సాధింపు చర్యలు మాని రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించండి. జగన్​కు ఆప్తులైన వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వీరిద్దరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరొస్తోందని తెలిసినా సీఎం జగన్ వారిని ప్రోత్సహిస్తున్నారు."

----- అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి

ఇదీ చదవండి:

వైకాపా విధ్వంసకర పాలనకు ఏడాది : తెదేపా

Last Updated : May 30, 2020, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details