ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 18, 2020, 10:41 AM IST

ETV Bharat / city

'భోజనం పెట్టే విషయంలోనూ మోసమేనా?'

క్వారంటైన్ కేంద్రాల్లో సరైన ఆహారం అందించడంలేదని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూలో ఏ ఒక్కటి సవ్యంగా అందించడంలేదన్నారు. క్వారంటైన్ కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లే వారికి రూ.2 వేలు ఇస్తామన్న ప్రభుత్వం.. ఆ హామీ నిలబెట్టుకోవడంలేదని ఆరోపించారు.

అయ్యన్నపాత్రుడు
అయ్యన్నపాత్రుడు

క్వారంటైన్ లో ఉన్నవారికి అందిస్తున్న ఆహారం విషయంలో వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూలో ఉన్న విధంగా ఎవరికైనా ఆహారం పెడుతున్నారా అని ప్రశ్నించారు. క్వారంటైన్​లో 14 రోజులు గడిపి ఇంటికి వెళ్లే వారికి రూ.2 వేలు ఇస్తామని ప్రకటించారని, కానీ అది అమలు కావడంలేదన్నారు. కేవలం వంద రూపాయలు ఇచ్చి పంపిస్తున్నారని ఆరోపించారు. మిగతా రూ.1900 ఏమైనట్లు అని ప్రశ్నించారు. అవి కూడా ఇచ్చేసినట్టు రాసుకుంటున్నారా అని నిలదీశారు.

నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం ఆసుపత్రుల్లో కరోనా నిర్ధరణ కిట్లు లేవని ఆరోపించారు. లక్షల కిట్లు ఏమైపోయాయని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రానికి కరోనా నిమిత్తం రూ. 8 వేల కోట్లు ఇచ్చిందన్నారు. ఆ నిధులు ఎక్కడ ఖర్చుపెట్టారో ప్రజలకు చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :'ఆ ఎస్సై నుంచి నాకు ప్రాణ హాని ఉంది'

ABOUT THE AUTHOR

...view details