చంద్రబాబు ఇంటిని ముంచాలని వైకాపా ప్రభుత్వం కుతంత్రాలు చేస్తుందని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున వరదలు వస్తే సీఎం ఒక్కసారి కూడా ఏరియల్ సర్వే చేయలేదని... లంక గ్రామాలు మునిగిపోతే రూ.500 ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించారు. కనీసం మీడియా సమావేశం పెట్టలేని సీఎం రాష్ట్రంలో ఉన్నారన్న ఆయన... కనీసం దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదని విరుచుకుపడ్డారు. విశాఖలో ప్రేమ సమాజం ట్రస్ట్ భూములు సైతం కాజేస్తున్నారన్న ఆయన...6 వేల ఎకరాలకు పైగా భూమిని విజయసాయిరెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు.
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ తెదేపా నేత అయ్యన్న పాత్రుడు
ప్రభుత్వంపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. చంద్రబాబు ఇంటిని ముంచాలని ప్రభుత్వం కుతంత్రాలు చేస్తుందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ తీరు పై మండిపడ్డ తెదేపా నేత అయ్యన్న పాత్రుడు