ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అన్న క్యాంటీన్లపై బొత్స వ్యాఖ్యలు విడ్డూరం: అయ్నన్న - latest news on anna canteen

పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మూసివేయడం తగదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్యాంటీన్లను పునరుద్ధరించాలని ఆయన కోరారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఇలాంటి వాటిపై లాభాపేక్ష ఏంటని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లపై బొత్స వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు.

అన్న క్యాంటీన్లపై బొత్స వ్యాఖ్యలు విడ్డూరం : అయ్యన్నపాత్రుడు

By

Published : Sep 10, 2019, 11:41 PM IST

అన్న క్యాంటీన్లపై బొత్స వ్యాఖ్యలు విడ్డూరం : అయ్యన్నపాత్రుడు

పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్ల రంగులు మార్చడానికి రూ.16 కోట్లు ఖర్చు పెట్టిన వైకాపా ప్రభుత్వం.. వాటిని కొనసాగించడానికి ఏమాత్రం చొరవ చూపడంలేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అన్న క్యాంటీన్లపై మంత్రి బొత్స వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. పేదలకు ప్రయోజనకరమైన క్యాంటీన్లపై లాభాపేక్ష చూడడం ఏమిటని ప్రశ్నించారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కేజీహెచ్ వద్ద అన్న క్యాంటీన్​ను నెలరోజులుగా తన సొంత నిధులతో నిర్వహిస్తున్నారు. విశాఖ నగరంలోని తెదేపా నేతలతో పాటు, భాజపా నేత విష్ణుకుమార్ రాజు... కేజీహెచ్ అన్న క్యాంటీన్​ను సందర్శించారు. క్యాంటీన్ల పేరు మార్పుచేసి... తిరిగి నిర్వహించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. కనీసం అక్టోబర్ 2 నాటికైనా అన్న క్యాంటీన్లు తెరుస్తారా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details