ETV-EEnadu Awareness Program: పలు జిల్లాల్లో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో గుండె సంబంధిత, కొవిడ్ అనంతర సమస్యలపై నిర్వహించిన అవగాహనా సదస్సుకు విశేష స్పందన లభించింది. ఏలూరులోని మర్చంట్స్ హాలులో గుండె సంబంధిత వ్యాధులు, కరోనా వచ్చి తగ్గిన తర్వాత రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రముఖ గుండె సంబంధిత నిపుణులు డా. అనూప్, డా. మహేశ్వరి సూచనలు, సలహాలు అందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యులు డా. ప్రకాశ్ చావల, డా. శ్రీధర్ , డా. ఆంజనేయ రెడ్డి లు తగు సూచనలు చేశారు.
ETV-EEnadu: ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో గుండె సమస్యలపై అవగాహన కార్యక్రమాలు - ఈనాడు అవగాహన కార్యక్రమం
Awareness Program: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో గుండె సంబంధిత, కొవిడ్ అనంతర సమస్యలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఏలూరు, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రజలనుంచి విశేష స్పందన లభించింది. ఆరోగ్యంగా ఉండాలంటే నడక, వ్యాయమం జీవన విధానంలో ఒక భాగంగా ఉండాలని వైద్యనిపుణులు తెలిపారు.
![ETV-EEnadu: ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో గుండె సమస్యలపై అవగాహన కార్యక్రమాలు ETV-EEnadu Awareness Program](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16471451-971-16471451-1664117797844.jpg)
ఈనాడు-ఈటీవీ
గుంటూరులోనూ గుండె, కొవిడ్ అనంతర సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక బృందావన్ గార్డెన్సులోని బాలాజీ కల్యాణ మండపంలో నిర్వహించారు. అవగాహన సదస్సుకు ప్రముఖ వైద్యులు రాఘవశర్మ, కల్యాణ్ చక్రవర్తి హాజరయ్యారు. ఆరోగ్యంగా ఉండాలంటే నడక, వ్యాయమం జీవన విధానంలో ఒక భాగంగా ఉండాలని నెల్లూరులో జరిగిన అవగాహనా సదస్సులో నిపుణులు తెలిపారు.
ETV-EEnadu Awareness Program
ఇవీ చదవండి: