'కరోనా వైరస్‌ను వంద శాతం దూరం చేయవచ్చు' - కరోనా వైరస్‌పై అవగాహన
ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించటం ద్వారా కరోనా వైరస్‌ను వంద శాతం దూరం చేయవచ్చని హైదారాబాద్‌కి చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ ఎంవీ.రావు తెలిపారు. ఇప్పటి వరకున్న లెక్కల ప్రకారం ఈ వైరస్ సోకిన వారిలో మరణాల సంఖ్య కేవలం ఒక్క శాతమే అని స్పష్టం చేశారు.
కరోనా వైరస్ విషయంలో భయాందోళనలు అవసరం లేదని హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ ఎంవీ.రావు స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం వైరస్ సోకిన వారిలో కేవలం ఒక్క శాతం మాత్రమే మరణాల సంఖ్య ఉందని, మలేరియా, డెంగీ, ఇతర వ్యాధులతో పోలిస్తే ఇది చాలా స్వల్పమని ఆయన తెలిపారు. ఈ వైరస్ సోకినా పూర్తిగా నయం చేయవచ్చన్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించటం ద్వారా వంద శాతం ఈ వైరస్‌ను దూరం చేయవచ్చంటోన్న డాక్టర్ ఎం.వి.రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.