తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మరో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. తమ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఆటోడ్రైవర్ సలీమ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భాగ్యనగరంలో మరో దారుణం...9 ఏళ్ల బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం - auto driver raped a minor girl
ఆడపిల్లలు,మహిళలపై అత్యాచారాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. బయటకు రావాలంటేనే బెంబేలెత్తే పరిస్థితులు నెలకొంటున్నాయి. పల్లె,పట్టణాలు తేడా లేకుండా నేరాలకు అడ్డాలుగా మారుతున్నాయి. వరుస ఘటనలు ఆడపిల్లల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఈ ఘటనపై ఇటు ప్రజాసంఘాలు.. అటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పిల్లల్ని బయటకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. యువతులు కార్యాలయాలకు వెళ్లాలంటే వెనకా ముందు ఆలోచించాల్సిన స్థితి వచ్చిందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. మహిళ రక్షణ చట్టాలను పకడ్పందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇవీ చదవండి :