ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DEE-CET RESULTS: డీఈఈ సెట్‌ ఫలితాల దోబూచులాట..! - ap updates

రాష్ట్రంలో డీఈఈ సెట్ ఫలితాలు(DEE CET results) అభ్యర్థులతో దోబూచులాడాయి. మొదట ఫలితాలను వెబ్ సైట్​లో పెట్టిన అధికారులు.. ఆ తర్వాత వాటిని తొలగించారు. దీంతో అభ్యర్థులలో ఆందోళన నెలకొంది.

DEE-CET
DEE-CET

By

Published : Oct 31, 2021, 7:56 AM IST

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (DEE-CET results) ఫలితాలు అభ్యర్థులతో దోబూచులాడాయి. ఫలితాలను మొదట వెబ్‌సైట్‌లో పెట్టిన అధికారులు ఆ తర్వాత శనివారం రాత్రి వాటిని నిలిపివేశారు. అప్పటికే చాలామంది విద్యార్థులు ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈనెల 26, 27 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొదట విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం 29న ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. శనివారం సమాధాన పత్రాలతో పాటు ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అనంతరం ఏ కారణం చేతనో ఫలితాలను నిలిపివేశారు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details