LIVE VIDEO: కూలిపోతుందని ముందే కూల్చేశారు.. - hyderabad latest news
తెలంగాణలోని హైదరాబాద్ కాటేదాన్ శాస్త్రిపురం ఓవైసీ హిల్స్‌లో ఓ భవనం అందరూ చూస్తుండగానే కుప్పకూలింది. శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకర స్థితిలో ఉన్న భవనాన్ని అధికారులు సాంకేతికతను ఉపయోగించి కూల్చేశారు. ఇరుగు పొరుగు ఇళ్లకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నేలమట్టం చేశారు. ఇన్నాళ్లూ పిల్లర్లు సరిగా లేక ప్రమాదకరంగా ఉన్న భవనాన్ని ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా కూల్చివేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
కూలిపోతుందని ముందే కూల్చేశారు
.