ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దారుణం: ప్రేమిస్తున్నానని వేధించాడు... కాదనేసరికి.. - యువతి పీక కోసిన యువకుడు

తెలంగాణలోని నేరేడుచర్లలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరిస్తోందన్న కారణంతో ఓ యువకుడు.. యువతిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

దారుణం : ప్రేమిస్తున్నానని వేధించాడు... కాదనేసరికి గొంతు కోశాడు..
దారుణం : ప్రేమిస్తున్నానని వేధించాడు... కాదనేసరికి గొంతు కోశాడు..

By

Published : Sep 9, 2021, 3:40 PM IST

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో దారుణం జరిగింది. మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో నివాసముంటున్న ఓ యువతిపై బాల సైదులు అనే యువకుడు బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. ప్రేమిస్తున్నానని కొంతకాలంగా అమ్మాయిని వేధిస్తున్న యువకుడు... ఆమెకు మరొకరితో పెళ్లి కుదిరిందని తెలుసుకుని దాడి చేశాడు. ఒంటరిగా వెళ్తున్న ఆమెపై బాల సైదులు బ్లేడుతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. యువతి పరిస్థితి విషమించడంతో 108 అంబులెన్స్​లో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

నేను కాలువ దగ్గర బట్టలు ఉతకడానికి పోతుంటే.. అక్కడ వాళ్ల చెల్లితో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఇటు రా అన్నాడు. నేను వెళ్లలేదు. చాలా సార్లు పిలిచాడు. అప్పుడు వెళ్లాను. పైకి చూడమన్నాడు.. బ్లేడుతో పీక కోసేశాడు. మూడు సార్లు కోశాడు. కొంతకాలంగా నేనంటే ఇష్టమని అంటున్నాడు. నేనేమో ఫ్రెండ్​షిప్​ అని చెప్పాను. బాధితురాలు.

ఇదీచదవండి.

BANK ROBBERY: బ్యాంకులో దోపిడీకి యత్నం.. కంప్యూటర్లు, హార్డ్​డిస్కులతో పరార్..

ABOUT THE AUTHOR

...view details