Attempt To Theft: రాజధాని అమరావతిలో మట్టి, కంకర ఎత్తుకెళ్తున్న దొంగలు ఇప్పుడు రూటు మార్చారు. రాయపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన విలువైన సిమెంట్ పైపులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పైపులు చోరీ చేస్తున్న ఇద్దరిని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 భారీ పైపులు తరలిస్తున్న ట్రాక్టర్, పొక్లెయిన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో పైపు విలువ 40 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఉంటుందని రైతులు తెలిపారు. దాదాపు 100 నుంచి 150 వరకు పైపులు ఇప్పటికే తరలించినట్లు తెలుస్తోంది.
రాజధాని ప్రాంతంలో దొంగలు.. పోలీసుల అదుపులో పలువురు - తుళ్లూరు మండలం
Attempt To Theft: మట్టి, కంకర దొంగలు రాజధాని అమరావతిలో రాయపూడి ఎత్తిపోతల పథకం పరికరాలను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. సిమెంట్ పైపులను ఎత్తుకెళ్లిన ఆనవాళ్లు కనిపించడం, దొంగతనం వ్యవహారం ఆ నోటా.. ఈ నోట వ్యాపించడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

రోడ్డు తవ్వి కంకర చోరీ కేసులో పురోగతి :రాజధాని ప్రాంతంలో రహదారి తవ్వి ఇసుక, కంకర చోరీ చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మంగళగిరి మండలం బేతపూడి, కురగల్లు, నీరుకొండలో రహదారులు తవ్వి ఇసుక, కంకరను తీసుకెళ్లిన పొక్లైయిన్, ట్రాక్టర్, టిప్పర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలు తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంకు చెందిన ఓ వ్యక్తివిగా గుర్తించారు. ఇవాళ తెల్లవారుజామున వీటిని సీజ్ చేశారు. కురగల్లుకు చెందిన ఓ వ్యక్తి తన కల్యాణ మండపం నిర్మాణం కోసం రహదారిని తవ్వేసినట్లు గుర్తించామన్నారు. దీనికి సంబంధించి నలుగురికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: