Fake Visas: నకిలీ వీసాలతో కువైట్ వెళ్లేందుకు 44 మంది మహిళల యత్నించిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. వీరిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. మహిళల వద్ద నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా పలు రాష్ట్రాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. ఈ మహిళలను విమానాశ్రయ పోలీసులకు ఇమిగ్రేషన్ అధికారులు అప్పగించారు. వీరిని పోలీసులు విచారిస్తున్నారు.
మధ్యలోనే చించేసి...
Fake Visas: విజిటింగ్ వీసా ఇండియన్ ఇమిగ్రేషన్ వద్ద చూపించి ఎంప్లాయిమెంట్ వీసా కువైట్లో చూపిస్తున్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. విజిటింగ్ వీసాతో ఫ్లైట్ ఎక్కి మధ్యలోనే దాన్ని చించేస్తున్నారని తెలిపారు. ముంబయిలో ఉన్న ప్రధాన ఏజెంట్ వీరిని దేశం దాటిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏపీలో మరో ఇద్దరు సబ్ ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు.