తెలంగాణలోని జగిత్యాల జిల్లా చెల్గల్లో పొలం వివాదం కారణంగా ఓ కుటుంబంపై ప్రత్యర్థులు దాడికి దిగారు. ఆరె మల్లేశం అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన గంగారెడ్డి అతని కొడుకులు దాడి చేశారు.
గంగారెడ్డి తన పొలంలో వరినాట్లు వేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ పొలంలో గడ్డి మందు కొట్టారు. దీంతో వరినారు ఎండిపోయింది. ఈ క్రమంలో మల్లేశమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావించి... గంగారెడ్డి కుటుంబసభ్యులు మల్లేశంపై దాడికి దిగారు. గొడవళ్లు, బండరాళ్లతో హత్య చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలో మల్లేశం తీవ్రంగా గాయపడ్డాడు.