ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెళ్లి సంబంధం చెడగొట్టాడని వ్యక్తిపై గొడ్డలితో యువకుడి దాడి

పెళ్లి చెడకొట్టాడని కోపంతో ఓ వ్యక్తి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన ఘటన.. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గోసంగి కాలనీకి చెందిన కోదండం పరశురాంపై ఆర్​బీ నగర్​కు చెందిన అల్లం శివ.. గొడ్డలితో దాడి చేశాడు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

murder attempt
murder attempt

By

Published : Oct 31, 2020, 12:41 AM IST

Updated : Oct 31, 2020, 6:33 AM IST

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చెడిపోయిందన్న యువకుడి బాధ ఒకరి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. తన పెళ్లి సంబంధం చెడగొట్టాడన్న కక్షతో పరుశురాం అనే వ్యక్తిపై ఓ యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పరుశురాం పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆస్పత్రికి తరలించారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఎదుట గోసంగి కాలనీకి చెందిన కోదండం పరుశురాంపై ఆర్​బీ నగర్​కు చెందిన అల్లం శివ గొడ్డలితో దాడి చేశాడు. పెళ్లి సంబంధం విషయంలో శివ ప్రవర్తన గురించి.. యువతి కుటుంబ సభ్యులకు పరుశురాం చెడుగా చెప్పాడని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అల్లం శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:పోలీసులు కొట్టారనే మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం!

Last Updated : Oct 31, 2020, 6:33 AM IST

ABOUT THE AUTHOR

...view details