''అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. సుఖీభవ'' అంటూ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్ అయిన కుర్రాడు శరత్‌పై దాడి జరిగింది. శరత్ తీవ్ర గాయాలతో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో శరత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతోంది. ఏదో ఫంక్షన్లో గొడవ జరిగి గుర్తుతెలియని వ్యక్తులు శరత్‌ను దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది. గొడవకు గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు.
"అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. సుఖీభవ" కుర్రాడిపై దాడి - DUM
''అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. సుఖీభవ'' అంటూ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్ అయిన కుర్రాడు శరత్‌పై దాడి జరిగింది. శరత్ తీవ్ర గాయాలతో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
!["అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. సుఖీభవ" కుర్రాడిపై దాడి attack on tik tok star sharath in a function in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13393264-948-13393264-1634607992674.jpg)
attack on tik tok star sharath in a function in hyderabad
హైదరాబాద్ నల్లకుంటకు చెందిన శరత్.. ఇటీవల ఓ వేడుకలో ఓ టీ యాడ్‌ను ఇమిటేట్ చేశాడు. 'అయ్యయ్యో వద్దమ్మా.. ఈ పక్కనే ఓ టీ కొట్టు పెట్టాను.. అందరికీ ఓ కప్పు టీ ఇస్తున్నాను.. డబ్బులు తీసుకోను కానీ.. సుఖీభవ.. సుఖీభవ' అంటూ డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో శరత్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిన విషయం తెలిసిందే.
Last Updated : Oct 19, 2021, 7:42 PM IST
TAGGED:
DUM