తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూరులో ఉద్రిక్తత నెలకొంది. మాలావత్ సిద్ధార్థ అనే యువకుడి మృతి కేసు దర్యాప్తునకు వెళ్లిన పోలీసులపై.. బాధిత కుటుంబం, బంధువులు దాడి చేశారు.
సిద్ధార్థ అనే వ్యక్తి.. గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన కనకం రాజేశ్ అనే యువకుడే దీనికి కారణమంటూ.. బాధిత కుటుంబం నిన్న ఆందోళనకు దిగింది. గ్రామానికి చేరుకున్న పోలీసులు.. వారిని చెదరగొట్టారు.