భారీ వర్షాలతో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలకు కారణం నాలాలను కబ్జా చేయడమే అంటున్నారు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ రంగానాయకుల గుట్టకాలనీ వాసులు. నాలా భూమిలన్నీ కబ్జాలకు గురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయమై గతంలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డిని నిలదీశారు. కాలనీ వరదలో మునిగిపోతుందంటూ కార్పొరేటర్‌పై దాడి చేశారు. తిరుమల్ రెడ్డిని గల్లా పట్టుకుని కొట్టారు. చర్చి దగ్గర ఉన్న నాలా కబ్జాకు గురైందని.. ఇన్నీ రోజులుగా కార్పొరేటర్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.