ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్కిమ్మింగ్​ చోరులు.. మీ ప్రమేయం లేకుండానే దోచేస్తారు! - atm theft

వాళ్లకు ఏటీఎం కేంద్రం కనిపిస్తే చాలు గుట్టు చప్పుడు కాకుండా అక్కడ మైక్రో కెమెరాలు, స్కిమ్మర్లు అమరుస్తారు. డబ్బులు తీసుకునేందుకు ఆయా కేంద్రాలకు వచ్చే వారి డెబిట్​ కార్డులను దర్జాగా క్లోనింగ్​ చేసేస్తారు. అనుమానం రాకుండా ఈ వ్యవహారం నడిపిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లు... నగర పోలీసులకు చిక్కారు.

http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/25-October-2019/4862483_74_4862483_1571973025880.png

By

Published : Oct 25, 2019, 10:34 AM IST

స్కిమ్మింగ్​ చోరులు.. మీ ప్రమేయం లేకుండానే దోచేస్తారు!

ఏటీఎం కేంద్రం వారి కంట పడిందా... అంతే! అక్కడ వాలిపోతారు. ఖాతాదారుల డెబిట్‌ కార్డుల్లో డాటా చౌర్యం చేసే పనిలో పడతారు. కంటికి కనిపించని విధంగా మైక్రో కెమెరా, స్కిమ్మర్లను అమరుస్తారు. ఖాతాదారులు డెబిట్‌ కార్డును ఉపయోగించి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్న వెంటనే వారి డాటా మొత్తం చౌర్యం అయిపోతుంది. తద్వారా కార్డు క్లోనింగ్‌ జరిగిపోతుంది. ఈ తరహా మోసాలు చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను జంటనగరాల పోలీసులు పట్టుకున్నారు. పది నెలల నుంచి ఈ కేటుగాళ్లు కార్డులు క్లోనింగ్‌ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

రొమానియా దొంగలు
రొమానియా దేశానికి చెందిన దింత విరిగల్‌ సోరనిల్‌, జార్జ్‌ కొంతకాలం క్రితం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్​కు వచ్చి ఒకరు మెహిదీపట్నంలో, మరొకరు బేగంపేటలో వేర్వేరుగా ఉంటున్నారు. పథకం ప్రకారం ఏటీఎం కేంద్రాల్లో స్కిమ్మర్లు, మైక్రో కెమెరాలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాదారుల డెబిట్‌ కార్డుల డాటా చౌర్యం చేసి... దాని ద్వారా వాటిని క్లోనింగ్‌ చేసేందుకు వ్యూహం రచించారు. ఇందుకోసం మైక్రో కెమెరాలు, స్కిమ్మర్లు ఉపయోగించారు.

కార్డు క్లోనింగ్​తో...

చౌర్యం చేసిన డాటాను ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న మరో విదేశీయుడికి పంపేవారు. వారు పంపే డాటా ద్వారా అతను కార్డు క్లోనింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గత 25 రోజులుగా ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లు ఉప్పల్‌, మెహిదీపట్నం, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పలు ఏటీఎంలలో డాటా చౌర్యం చేశారు. ఇటీవల అబిడ్స్‌లోని జగదీశ్​ మార్కెట్‌లో ఇదే తరహాలో డాటా చౌర్యంకు ప్రయత్నించగా అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చి బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. దీనితో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి నేరస్తులను పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు. తిరిగి తమ కస్టడీలోకి తీసుకుని ఇప్పటివరకు ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేశారా, లేక కార్డులు క్లోనింగ్‌ చేసే పనిలోనే ఉన్నారా, ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ తరహా నేరాలకు పాల్పడ్డారా అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

అంతర్రాష్ట్ర నేరగాళ్లను పట్టుకోవడంలో చాకచాక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందికి కమిషనర్‌ నగదు పురస్కారాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details