Atlanta Expatriates Supported To Amaravati Farmers : అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే ఏకైక లక్ష్యంతో రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. అమరావతి రైతుల యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. వైకాపా ప్రభుత్వం ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడిన మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. అమరావతినే రాజధానిగా ఉండాలని కేవలం రాష్ట్ర ప్రజలు మాత్రమే కాకుండా ప్రవాసాంధ్రులు కూడా బలంగా కోరుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని అట్లాంటాలో ప్రవాసాంధ్రులు.. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం అమరావతితోనే సాధ్యం అంటూ తేల్చిచెప్పారు. అమరావతికి సంఘీభావంగా జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం అమరావతితోనే సాధ్యం: అట్లాంట ప్రవాసాంధ్రులు - mahapadayatra
Atlanta Expatriates Supported To Amaravati : అమరావతే రాజధానిగా చేయాలని రైతులు చేస్తున్న పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న ఈ యాత్రకు అశేష స్పందన లభిస్తోంది. అమరావతినే రాజధానిగా ప్రకటించాలని కేవలం రాష్ట్ర ప్రజలే కాకుండా ఖండాంతరాలలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా బలంగా కోరుకుంటున్నారు.
Atlanta Expatriates Supported To Amaravati