atchannaidu fire on ysrcp: తెదేపా నేతలే లక్ష్యంగా జగన్ పాలన కొనసాగుతోందని ఆ పార్తీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తన దీక్ష ద్వారా విద్యుత్ పునరుద్ధరింపజేసిన జీవీపై అక్రమ కేసులేంటని నిలదీశారు. తక్షణమే అక్రమ కేసులు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడటమే జీవీ ఆంజనేయులు చేసిన తప్పా అని ప్రశ్నించారు. అభివృద్ధి వదిలేసి అక్రమ కేసుల నమోదుకే సమయం వెచ్చిస్తున్నారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. సమస్యల పరిష్కారాన్ని జీర్ణించుకోలేక తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు ప్రజలు చరమగీతం పాడతారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Atchannaidu fire on ysrcp: 'తెదేపా నేతలే లక్ష్యంగా జగన్ పాలన కొనసాగుతోంది' - cm jagan
cases on tdp leaders: అభివృద్ధి వదిలేసి అక్రమ కేసుల నమోదుకే వైకాపా ప్రభుత్వం వెచ్చిస్తుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తన దీక్ష ద్వారా విద్యుత్ పునరుద్ధరింపజేసిన జీవీపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. అక్రమ కేసులు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలన్నారు.
atchannaidu comments on ysrcp government