ప్రభుత్వం చేసిన తప్పులను నిలదీయడమే తాను చేసిన తప్పయితే... ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నిలదీస్తూనే ఉంటానని మాజీమంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సర్కారు అవినీతిని ప్రశ్నించడమే నేరమైతే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాను ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. నిజాయితీ తన ధైర్యమని... సత్యం ఆయుధమని పేర్కొన్నారు. ప్రజాక్షేమమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈఎస్ఐలో అక్రమాల పేరుతో అక్రమ కేసులో ఇరికించారని ప్రతీ ఒక్కరూ గుర్తించారన్నారు. అక్రమ అరెస్టుని ఖండించారు. అనారోగ్యంగా ఉంటే కోలుకోవాలని ప్రార్థించారని ట్వీట్ చేశారు.
'నిజాయితీ నా ధైర్యం... సత్యం నా ఆయుధం' - atchannaidu comments on jagan
ప్రభుత్వ తప్పులను నిలదీయడమే తాను చేసిన తప్పయితే.. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నిలదీస్తూనే ఉంటానని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. ప్రజాక్షేమమే తన లక్ష్యమన్నారు. ఈఎస్ఐలో అక్రమాల పేరుతో అక్రమ కేసులో తనను ఇరికించిన విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించి అరెస్టుని ఖండించారని గుర్తుచేశారు.
అచ్చెన్నాయుడు