ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 27, 2020, 3:52 PM IST

ETV Bharat / city

అన్ని మీడియా సంస్థలను అనుమతించాలి: అచ్చెన్నాయుడు

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలకు సంబంధించిన 20 అంశాలపై చర్చించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను పూర్తిస్థాయిలో విశ్లేషించి ప్రజలకు నష్టం చేకూర్చే అంశాలుంటే సవరణలకు పట్టుబడతామని స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా అచ్చెన్నాయుడు తెదేపా శాసనసభపక్ష సమావేశం నిర్వహించారు.

atchannaidu teleconference with tdp leaders
అచ్చెన్నాయుడు

శాసనసభ సమావేశాలు ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని మీడియా సంస్థలను అనుమతించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. తప్పనిసరిగా ప్రశ్నోత్తరాలకు, స్వల్పకాలిక చర్చకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలని కోరారు. ఉభయసభల్లో లెవనెత్తాల్సిన అంశాలపై టెలికాన్ఫరెన్స్​లో నిర్ణయం తీసుకున్నారు.

లెవనెత్తాలనుకున్న అంశాలు...

ఎన్ఆర్ఈజీఎస్ బకాయిల నిలిపివేత, టిడ్కో ఇళ్ల పంపిణీ – ఇళ్ల పట్టాల్లో అవినీతి, దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు, భారీ వర్షాలు, వరదలకు పంట నష్టం – పంటల కొనుగోళ్లు, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపు, నూతన ఇసుక పాలసీ – దోపిడీ, నిత్యావసర ధరల పెరుగుదల – ప్రజలపై భారాలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం, పెరుగుతున్న నిరుద్యోగం – మూతపడుతున్న పరిశ్రమలు, పీపీఏల రద్దు – జీవో నెం.25, ప్రైవేట్ టీచర్ల ఇబ్బందులు – ప్రభుత్వ నిర్లక్ష్యం, మద్యం అమ్మకాలు – నాసిరకం బ్రాండ్లు, పంచాయతీరాజ్, ఆర్​అండ్​బీ రోడ్ల దుస్థితి – రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్, జీవో 21 రద్దు, సంక్షేమ పథకాల రద్దు - సబ్​ప్లాన్ నిర్వీర్యం, పెన్షన్ రెండో విడత పెంపు వైఫల్యం, కరోనా – సహాయ చర్యల్లో వైఫల్యం, పన్నుల పెంపు – ఆస్థి పన్ను, స్థానిక సంస్థల ఎన్నికలు, దేవాలయాలపై దాడులు, మితిమీరిన అప్పులు – దుబారా తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు.

ఇదీ చదవండీ...

వచ్చే ఎన్నికల్లో తెదేపాను అధికారంలోకి తేవడమే లక్ష్యం: అచ్చెన్న

ABOUT THE AUTHOR

...view details