సమాజానికి సేవ చేయాలంటే తెదేపా(tdp)ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(atchannaidu) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహానాడు(mahanadu 2021)లో సంస్థాగత నిర్మాణంపై అచ్చెన్న మాట్లాడారు. చంద్రబాబు(chandrababu) రాష్ట్రానికి తీసుకువచ్చిన మంచిపేరును.. జగన్ మోహన్‌రెడ్డి(ys jagan) నాశనం చేస్తున్నారని విమర్శించారు. మహానాడు పూరైన పది రోజుల్లో పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరోసారి అరెస్ట్‌కు కూడా తాను సిద్ధమై పంచె, టీషర్టు సిద్ధం చేసుకున్నానని వ్యాఖ్యానించారు. స్వార్థం కోసం కొంతమంది నాయకులు పార్టీని వీడినా పటిష్టమైన కార్యకర్తల బలం ఉన్న తెదేపాకు ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు.
atchannaidu: 'మరోసారి అరెస్ట్‌కు సిద్ధమే.. పంచె, టీషర్టు సిద్ధం చేసుకున్నాను' - atchannaidu news
వైకాపా ప్రభుత్వంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(atchannaidu kinjarapu) మండిపడ్డారు. చంద్రబాబు(chandrababu) రాష్ట్రానికి తీసుకువచ్చిన మంచిపేరు.. జగన్ రెడ్డి నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్న ఆయన.. మరోసారి అరెస్ట్‌కు సిద్ధమేనంటూ సవాల్ విసిరారు.
atchannaidu fiers on cm jagan