ఆసరా పథకం (YSR asara) పేరుతో డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ అన్యాయం చేస్తున్నారని.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. 98 లక్షల మంది డ్వాక్రా మహిళల్లో గతేడాది 87లక్షల మందికే పథకాన్ని వర్తింపజేసి, ఈసారి మరో ఎనిమిదన్నర లక్షల మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తీసేశారని ఆక్షేపించారు.
ATCHANNAIDU: 'ఆసరా కాదు.. కోటి మంది డ్వాక్రా మహిళలకు టోకరా' - atchennaidu comments on ysr asra
ఆసరా పథకం (YSR asara) పేరుతో సీఎం జగన్ కోటి మంది డ్వాక్రా మహిళలకు టోకరా పెట్టారని తెలుుగదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
atchannaidu comments on ysr asara scheme
గత ఏడాది 6 వేల 792 కోట్ల రుణాల మాఫీకి మీటనొక్కి, ఆ తర్వాత 6 వేల 319 కోట్లే చెల్లించినట్లు ప్రకటించారని గుర్తు చేశారు. ఈసారి 6వేల 440 కోట్లు చెల్లిస్తున్నామంటున్నారని.. 8.26 లక్షల మంది లబ్ధిదారులు తగ్గినా.. 121 కోట్లు ఎక్కువ చెల్లింపులు చేయడం తాడేపల్లి ప్యాలస్ మాయాజాలమేనన్నారు. 45ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ.3వేల చొప్పున ప్రతినెలా సాయం చేస్తానని హామీ ఏమైందని అచ్చెన్న ప్రశ్నించారు.
ఇదీ చదవండి: