ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - today horoscope

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

ASTROLOGICAL PREDICTION FOR MAY
ASTROLOGICAL PREDICTION FOR MAY 19

By

Published : May 19, 2021, 4:32 AM IST

ఒక వ్యవహారంలో అందరి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలుచేస్తాయి.

ఉత్సాహంతో ముందుకు సాగితే సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. లేనిపోని అనుమానాలతో కాలయాపన చేయకండి. గోవింద నామాలు చదవాలి.


మిశ్రమకాలం. మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. కుటుంబ సభ్యులను సంప్రదించకుండా ఏ పనిని తలపెట్టకండి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శ్రీ రామ నామాన్ని జపించాలి.

శుభకాలం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్మీ స్తోత్రము చదివితే మంచిది.

ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాల్లో సమయోచితంగా స్పందించి అధికారుల మెప్పును పొందుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.

చేసే పనిలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. రవిద్యాన శ్లోకం చదివితే మేలు జరుగుతుంది.

ప్రయత్న కార్యసిద్ధి కలదు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.

మధ్యమ ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అస్థిర బుద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలహాలు సూచితం. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. నవగ్రహ శ్లోకం చదవండి.

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధు మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

గ్రహబలం బాగుంది. మీకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్ట దైవారాధన శుభప్రదం.

ఒక తీపివార్తను వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఇష్టదైన ప్రార్థన శుభప్రదం.

చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. సౌభాగ్య సిద్ధి కలదు. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ఆంజనేయ ఆరాధన శుభాన్నిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details