ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - horoscope news today

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

రాశిఫలాలు
ASTROLOGICAL PREDICTION

By

Published : May 14, 2021, 4:00 AM IST

బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇష్ట దైవారాధన మంచినిస్తుంది.

మనోబలంతో చేసే పనులు సఫలమవుతాయి. తోటివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మానసికంగా ఇబ్బందులు కలిగిస్తాయి. దుర్గ ధ్యానం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారములో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఆదిత్య హృదయాన్ని పఠించాలి.

శుభకాలం. మానసికంగా ధృడంగా ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

తోటివారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఇష్ట దైవనామాన్ని జపిస్తే మేలైన ఫలితాలు వస్తాయి.

ఉద్యోగంలో మిశ్రమకాలం. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఇష్టదైవ నామస్మరణ ఉత్తమం.

చేపట్టే పనుల్లో పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలను మార్చుకుంటూ.. ముందుకు సాగాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

శ్రమ ఫలిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఒక వార్త మిమ్మల్ని కలవర పెడుతుంది. విష్ణు ఆరాధన శుభప్రదం.

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధించాలి.

మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గొప్ప ఆలోచనా విధానంతో అభివృద్ధిని సాధిస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.

ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పరిస్థితులు తారుమారు కాకుండా ముందస్తు జాగ్రత్త మంచిది. అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి అనుకూల ఫలితాలున్నాయి. చక్కని ఆలోచనా విధానంతో ముందుకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రము పఠించడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details