దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి కోసం దాతలిచ్చిన భూములను ప్రభుత్వం వేలం వేస్తే.. ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని.. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ హెచ్చరించారు. మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. దేవాదాయ భూములకు ప్రభుత్వం కేవలం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఆస్తులను సంరక్షించాలే తప్ప అమ్ముకోవడానికి వీల్లేదన్నారు. దీనికి సంబంధించి గతంలో హైకోర్టు తీర్పు ఉందని గుర్తుచేశారు.
ఆస్తులను సంరక్షించాలే తప్ప అమ్ముకోవడానికి వీల్లేదు: పవన్ - Pawan Kalyan comments on jagan
దాతలిచ్చిన భూములను ప్రభుత్వం వేలం వేస్తే.. ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని పవన్ హెచ్చరించారు. దేవాదాయ భూములకు ప్రభుత్వం కేవలం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి గతంలో హైకోర్టు తీర్పు ఉందని గుర్తుచేశారు. దేవాలయ ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన పాలకులు.. తామే యజమానులం అనుకోవద్దని హితవు పలికారు.
గతంలో తితిదే భూములను వేలం వేయాలని చూసిన ప్రభుత్వం... ప్రజల నుంచి వ్యతిరేకత రాగా వెనక్కి తగ్గిందని పవన్ వివరించారు. తితిదే ఆస్తుల విక్రయాన్ని నిలుపుదల చేస్తూ ఇచ్చిన జివో 888 అన్ని ఆలయాలు, మఠాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆ జీవోను తన ట్వీట్‌కు జతపర్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ.. పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గితేనే వేలం, విక్రయం వంటి ప్రకటనలు వస్తాయని అభిప్రాయపడ్డారు. దాతలిచ్చిన ఆస్తులను నడి బజారులో అమ్మకానికిపెడితే భక్తుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని స్పష్టం చేశారు. దేవాలయ ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన పాలకులు.. తామే యజమానులం అనుకోవద్దని హితవు పలికారు.
ఇదీ చదవండీ... సభలో వ్యవహారించాల్సిన తీరుపై సీఎం జగన్ దిశానిర్దేశం!