ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Notice: అచ్చెన్నాయుడికి నోటీసు! - tdp latest updates

శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను అగౌరవపరిచేలా బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు సెప్టెంబరు 14న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసునిచ్చేందుకు నిర్ణయించింది. మంగళవారంనాడే అచ్చెన్నాయుడు కమిటీ ముందు హాజరవ్వాల్సి ఉంది.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

By

Published : Sep 1, 2021, 7:07 AM IST

శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను అగౌరవపరిచేలా బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు సెప్టెంబరు 14న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసునిచ్చేందుకు నిర్ణయించింది. మంగళవారంనాడే అచ్చెన్నాయుడు కమిటీ ముందు హాజరవ్వాల్సి ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నానని, సమయమిస్తే వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇస్తానని ఆయన రాతపూర్వకంగా కోరినట్లు తెలిసింది. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని సెప్టెంబరు 14న హాజరవ్వాలని కమిటీ స్పష్టం చేసింది. సంఘం ఛైర్మన్‌ కాకాణి గోవర్దన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం ప్రివిలేజ్‌ కమిటీ సమావేశమైంది. స్పీకర్‌పై వ్యక్తిగత దూషణలు చేశారనే అభియోగంపై తెదేపా మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ కూడా మంగళవారం కమిటీ ముందు హాజరవ్వాల్సి ఉంది. ఆయన రాలేదు. తాను వ్యక్తిగత విమర్శలు చేశాను తప్ప.. సభాపతి స్థానాన్ని అగౌరవపరచలేదని కూన రవికుమార్‌ కమిటీకి వివరణ పంపినట్లు తెలిసింది. స్పీకర్‌ స్థానంలో ఉన్న వ్యక్తిని దూషించడమంటే ఆ స్థానాన్ని కించపరిచినట్లేనన్న భావనను కమిటీ వ్యక్తం చేసినట్లు తెలిసింది. వ్యక్తిగతంగా హాజరవ్వాలని నోటీసునిచ్చినా స్పందించనందున ధిక్కారం (కంటెంప్ట్‌)గా భావించి ఆయనపై చర్య తీసుకునేలా శాసనసభకు సిఫార్సు చేయాలని కమిటీ నిర్ణయించింది.

*తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడిపై శాసనసభలోనే సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపైనా కమిటీ చర్చించింది. దీనిపై పూర్తి సమాచారంతో వివరణ కోరకపోయినా స్వయంగా స్పందించి పంపుతున్నానంటూ కమిటీకి రామానాయుడు నివేదించినట్లు తెలిసింది. అయితే ఈ వివరణలో అన్నింటికీ సమాధానాలు లేవని, ఫిర్యాదు పూర్తి సమాచారాన్ని ఆయనకు పంపి 10రోజుల్లో వివరణ కోరాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.

8పేజీలతో నిమ్మగడ్డకు సమాచారం

తమపై అనుచిత వ్యాఖ్యలతో గవర్నర్‌కు లేఖ రాశారని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఇచ్చిన ఫిర్యాదుపైనా ప్రివిలేజ్‌ కమిటీ చర్చించింది. ‘ఈ లేఖ కమిటీ పరిధిలోకి రాదు. అయినా శాసన వ్యవస్థ, శాసనసభ్యులపై నాకు గౌరవం ఉంది’ అన్న వివరణను గతంలోనే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పంపారు. ఆయన వ్యాఖ్యలు సభాహక్కుల ఉల్లంఘన కిందికెలా వస్తాయో తెలియపరుస్తూ 8పేజీల సమాచారాన్ని పంపాలని కమిటీ నిర్ణయించింది. వాటిపై 10రోజుల్లోగా నిమ్మగడ్డ సమాధానమివ్వాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్న రహదారులు.. పట్టించుకోండి సారూ..!

ABOUT THE AUTHOR

...view details