ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Assassination Attempt: స్కూల్ ప్రిన్సిపల్​పై హత్యాయత్నం - medchal crime news

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గ్రీన్​హిల్స్ కాలనీలో ఓ ఆగంతకుడు స్కూల్ ప్రిన్సిపల్​ను చంపబోయాడు. మెడ, ఛాతీపై దాడి చేసి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Assassination Attempt
Assassination Attempt

By

Published : Aug 16, 2021, 12:50 AM IST

స్కూల్ ప్రిన్సిపల్​పై హత్యాయత్నం.. సీసీటీవీలో నమోదైన దృశ్యాలు..

స్కూల్ ప్రిన్సిపల్​పై హత్యాయత్నం (Assassination Attempt on School Principal) జరిగిన ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా బహదూర్​పల్లి.. గ్రీన్​హిల్స్ కాలనీలో చోటుచేసుకుంది. గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన హరిప్రసాద్ స్థానికంగా భవ్య సాయి స్కూల్ యజమానిగా ఉంటూ స్కూల్ ప్రిన్సిపల్​గా పనిచేస్తున్నారు. గ్రీన్​హిల్స్​లో ఆయనకు వాటర్ ప్లాంట్ ఉంది. శనివారం రాత్రి 9:30 ప్రాంతంలో దానిని మూసి అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న స్కూల్​కు వెళ్తుండగా ఓ యువకుడు ప్రిన్సిపల్ హరిప్రసాద్ మొహం, మెడ, ఛాతీపై కత్తితో దాడి చేసి చంపబోయాడు.

దాడి చేస్తున్న సమయంలో అటు నుంచి కొంత మంది వ్యక్తులు రావడం చూసి నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హరిప్రసాద్ ప్రస్తుతం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details