ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ASPRTC letter To TSRTC : తెలంగాణ ఆర్టీసీకి ఏపీఎస్‌ఆర్టీసీ లేఖ... మరిన్ని బస్సు సర్వీసులు పెంచుదాం... - తెలంగాణకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు

కొవిడ్‌కు ముందులా పూర్తి స్థాయిలో బస్సులన్నీ నడుపుతుండటం, ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుండటంతో ఏపీ, తెలంగాణ మధ్య అంతర్‌రాష్ట్ర సర్వీసులను మరిన్ని పెంచేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. రెండు రాష్ట్రాల్లో మరిన్ని బస్సు సర్వీసులు పెంచుదామంటూ ఏపీఎస్ఆర్టీసీ తాజాగా టీఎస్ఆర్టీసీకి లేఖ రాసింది.

ASPRTC letter To TSRTC
తెలంగాణ ఆర్టీసీకి ఏపీఎస్‌ఆర్టీసీ లేఖ

By

Published : Nov 17, 2021, 7:48 AM IST

కొవిడ్‌కు ముందులా పూర్తి స్థాయిలో బస్సులన్నీ నడుపుతుండటం, ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుండటంతో ఏపీ, తెలంగాణ మధ్య అంతర్‌రాష్ట్ర సర్వీసులను మరిన్ని పెంచేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. గతేడాది చేసుకున్న ఒప్పందంకంటే రెండు రాష్ట్రాల్లోనూ మరిన్ని కి.మీ.మేర బస్సులు నడుపుదామంటూ తెలంగాణ ఆర్టీసీకి ఏపీఎస్‌ఆర్టీసీ తాజాగా లేఖ రాసింది. ఇప్పటివరకు కొవిడ్‌ రెండు దశల కారణంగా ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో పరిమితంగా సర్వీసులు నడిపారు. 2,3 నెలలుగా పూర్తిస్థాయిలో సర్వీసులు నడుపుతున్నారు. ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతోంది. దీంతో లాభదాయకంగా ఉండే తెలంగాణకు అంతర్‌రాష్ట్ర సర్వీసులు పెంచాలని ఏపీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది. ఇందులో భాగంగా రెండు ఆర్టీసీలు నిత్యం 2.05 లక్షల కి.మీ.చొప్పున నడిపేందుకు అంగీకరించాలని కోరుతూ ఏపీఎస్‌ఆర్టీసీ లేఖ రాసింది.

ABOUT THE AUTHOR

...view details