ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెట్రోల్ ధర లీటర్ రూ.200కు పెరిగితే... బైక్‌పై ముగ్గురు.! - పెట్రోల్ ధరల పెరుగుదల

పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదలపై అసోం భాజపా అధ్యక్షుడు భాబేష్ కలిట వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలు లీటర్ రూ.200కు పెరిగితే... బైక్‌పై ముగ్గురు ప్రయాణించేందుకు అనుమతిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారాయన.

PETROL PRICE
PETROL PRICE

By

Published : Oct 21, 2021, 6:34 AM IST

పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదలపై అసోం భాజపా అధ్యక్షుడు భాబేష్ కలిట వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలు లీటర్ రూ.200కు పెరిగితే... బైక్‌పై ముగ్గురు ప్రయాణించేందుకు అనుమతిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. రవాణా అధికారులకు ఆదేశాలు జారీచేసి ప్రయాణించేందుకు అనుమతించేలా సర్కారు అనుమతిస్తుందని భాబేష్ కలిట వ్యాఖ్యానించారు. తముల్పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భాబేష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

అసోం బీజేపీ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భబేష్‌ చవకబారు వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆయన వ్యాఖ్యలు సీరియస్‌గా మాట్లాడారా... లేక సరదా కోసం మాట్లాడారా అన్నది స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ నేత బొబ్బీట శర్మ నిలదీశారు. సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల.. భాబేష్‌కు స్పృహ లేదని ఈ వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు. పెట్రో, నిత్యావసరాల ధరల పెరగడంతో సామాన్యులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుతున్నా.. పెట్రో ధరలు బీజేపీ ప్రభుత్వం పెంచుతోందని విమర్శించారు. అచ్చే దిన్‌ అంటే ఇదేనా అంటూ బీజేపీని కాంగ్రెస్‌ నేత నిలదీశారు. గత కొన్ని రోజులుగా పెట్రో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వంట గ్యాస్ ధరలు కూడా పెరిగి సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు.

ఇదీ చదవండి :Health benefits: చిటికెడు వాముతో ఇన్ని లాభాలా?

ABOUT THE AUTHOR

...view details