ఆర్టీసీ జేఏసీ బస్ రోకోను అడ్డుకునేందుకు పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడాన్ని... తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తప్పుబట్టారు. హైదరాబాద్ మీర్పేట పరిధిలోని ఉర్మిళానగర్ కాలనీలో ఆయన అపార్ట్మెంట్కు వచ్చి ఉదయమే గృహనిర్బంధం చేశారని తెలిపారు. అప్పటికే పెద్దఎత్తున ఆర్టీసీ కార్మికులు ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ... అశ్వత్థామరెడ్డి ఇంట్లోనే దీక్షకు దిగారు. ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు తమ దీక్షను కొనసాగిస్తానని తెలిపారు. పోలీసులు తనను బలవంతంగా అరెస్టు చేసినా... పోలీస్స్టేషన్లో దీక్ష కొనసాగిస్తానని తేల్చిచెప్పారు.
ఇంట్లోనే దీక్ష ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ - ASHWATHAMA REDDY STARTED DEEKSHA IN HIS HOME
పోలీసుల వేధింపులకు బెదరం... ముందస్తు అరెస్టులు చేసినా వెనకడుగు వేయం... ఇంట్లోనే దీక్ష చేపట్టా.. చర్చలకు పిలిచేవరకు దీక్ష కొనసాగుతుంది. అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లోనే దీక్ష కొనసాగిస్తా: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి
ఇంట్లోనే దీక్ష ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్