అమరావతి కోసం వెలగపూడిలో 151 గంటల దీక్ష చేస్తున్న రైతులు, యువకులకు తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు, సీపీఐ నేత నారాయణ సంఘీభావం తెలిపారు. అమరావతి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతుందని అశోక్‌బాబు అన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు పడినా అంతిమంగా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 29 గ్రామాల ఉద్యమం అని ప్రభుత్వమే అసత్యాలు ప్రచారం చేస్తోందన్న అశోక్‌బాబు.. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం మేరకే రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపామని పేర్కొన్నారు. మండలిలో తెదేపాకు మెజారిటీ ఉంది కాబట్టి.. అన్యాయాన్ని అడ్డుకున్నామని తెలిపారు. ప్రజలను కలవని జగన్ .. ఎక్కడ ఉన్నా ఒక్కటేనని అశోక్‌బాబు విమర్శించారు. ఈనెల 11న తెదేపా జనరల్ బాడీ సమావేశంలో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.
'అమరావతి పోరాటంలో అంతిమ విజయం రైతులదే' - cpi narayana comments on jvl
అమరావతి కోసం వెలగపూడిలో 151 గంటలపాటు దీక్ష చేస్తున్న రైతులు, యువకులకు తెదేపా నేత అశోక్ బాబు, సీపీఐ నేత నారాయణ మద్దతు తెలిపారు. రాజధాని పోరాటంలో రైతుల మరణాలను ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని నారాయణ అన్నారు. భాజపా ఎంపీ జీవీఎల్.. జగన్‌కు ఏజెంట్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాజధానిని కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ఏర్పాటుచేయమని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని అశోక్ స్పష్టంచేశారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న ఈ పోరాటం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.
అవన్నీ ప్రభుత్వ హత్యలే...
జగన్ తీరు మార్చుకోకపోతే పతనం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజధాని ఆందోళనల వల్ల గుండెపోటుతో 39 మంది మృతి చెందితే ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ మరణాలను ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలన్నారు. భాజపా నేత జీవీఎల్.. జగన్‌కు పక్కా ఏజెంట్‌గా పని చేస్తున్నారని ఆరోపించారు. జీవీఎల్‌ను పార్టీ నుంచి తప్పిస్తే భాజపాను నమ్మవచ్చన్న నారాయణ.. తప్పించకపోతే జగన్‌తో భాజపానే నాటకాలు ఆడిస్తుందని భావిస్తామన్నారు. అమరావతి ఉద్యమం నిరంతరంగా సాగేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. రాజకీయ పోరాటంలో అండగా ఉంటామని సీపీఐ నారాయణ హామీ ఇచ్చారు. ఇది 29 గ్రామాల ఉద్యమం కాదు.. 5 కోట్ల మంది కోసం పోరాటమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :పరాకాష్ఠకు వైకాపా ప్రభుత్వ ఫ్యాక్షనిస్ట్ ధోరణి: చంద్రబాబు